భార్యతో గొడవ.. బెడ్రూమ్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం.. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహం తరలింపు
హైదరాబాద్ : భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి బెడ్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్ గఫార్ (34) అనే వ్యక్తి గురువారం రాత్రి భార్యతో గొడవపడిన అనంతరం బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న గఫార్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాత్రి గడిచినా గఫార్ గది నుంచి బయటకు రాకపోవడంతో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబర్‌పేట పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


