హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం.. పట్టణ పదాధికారుల సమావేశంలో నేతలు
బెల్లంపల్లి ( మంచిర్యాల జిల్లా) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి అధ్యక్షతన పట్టణ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి, పట్టణ ఇన్‌ఛార్జి శైలేందర్‌సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో పురోగతి లేదన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పట్టణంలోని శక్తి కేంద్రాలకు ఇన్‌ఛార్జిలను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో నల్లుల సంగీత, ఎర్రోజు శ్రీనివాస్, దూది ప్రకాష్, జిదుల రాములు, కోడి సురేష్, ఎరుకల నర్సింగ్, నిట్ట అరుణ సుందరి, ఆకుల శంకర్, కనకం శ్రీనివాస్, అల్లకాటి మహేష్, తోటపల్లి ఓంసాయి, సుక్క మల్లేష్, చింతకింది లావణ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


