పుట్టిన ప్రతి వ్యక్తికి ఆర్మీ శిక్షణ అవసరసమే - మాజీ అధికారి

పుట్టిన ప్రతి వ్యక్తికి ఆర్మీ శిక్షణ అవసరసమే - మాజీ అధికారి

బాల్కొండ (నిజామాబాదు) : హిందూ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి నిర్భంద ఆర్మీ శిక్షణ అవసరసమేనని యన్. సి. సి.(అర్మీ)మాజీ ప్రథమ అధికారి బాల్కొండకు చెందిన బ్రాహ్మ రౌతు నర్సింగ్ రావు అన్నారు.దేశంలో ప్రస్తుతం పరిస్థితుల దృశ్య పుట్టిన ప్రతి విద్యార్థికి నిర్భంద సైనిక శిక్షణ ఉండేటట్లు కేంద్రం చొరవ చుపాలని అయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇందుకు సంబదించిన వివరాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా బిక్నూర్ రైల్వే స్టేషన్ సమీపం లో 223/12 (టి )బెటాలియన్, నిజామాబాదు ఆధ్వర్యం లో గత రెండు సంవత్సరాల నుండి (100) మంది యన్. సి.సి (ఆర్మీ)శిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2027 లో తుది పరీక్షలకు హాజరయ్యే అభ్యర్యుల డ్రిల్ పరేడ్ ను పర్యవేక్షించాలని బిక్నూర్ యూనిట్ అధికారి ఏ.రవి కుమార్ విజ్ఞప్తి మేరకు బాల్కొండకు చెందిన బ్రాహ్మ రౌతు నర్సింగ్ రావు శుక్ర వారం రోజు సాయంత్రం బిక్నూర్ కు వెల్లి గత రెండు సంవత్సరాల ఎన్. సి.సి ఆర్మీ శిక్షణ పొందిన విద్యార్థుల డ్రిల్ పరెడ్ ను పరిశీలన చేసారు.గత రెండు సంవత్సరాలనుండి శిక్షణ పొందుతూ తుది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షల్లో ప్రాక్టికల్ లో వివిధ మెళకువల గురించి, శిక్షణ పొందే అభ్యర్థు లకు నర్సింగ్ రావు పలు సూచ నలను చేసారు.అనంతరం బిక్నూర్ యూనిట్ అధికారి నరేష్ మట్లాడుతూ యన్. సి.సి (ఆర్మీ) లో (18) సంవ త్సరాలపాటు సేవలను అందించి ప్రథమ అధికారి హోదాలో రిటైర్డ్ అయిన బాల్కొండకు చెందిన బి. ఆర్. నర్సింగ్ రావు సేవల్ని గుర్తు చేస్తూ నర్సింగ్ రావు ఆధ్వర్యం లో ఎన్. సి.సి ఆర్మీ శిక్షణ పొందిన విద్యార్థుల నేడు ఆర్మీ నేవీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యో గాల్లో, రెవెన్యూ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గ కొందరు, ఉద్యోగా లు చేస్తున్నారని,అలాగే ప్రస్తుతం శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ శిక్షణలో దృఢ సంకల్పం తో ఆత్మ దైర్యంతో ముందుకు వెల్లి దేశ సేవ చేయడానికి అర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ లో చేరుతాను అని ప్రతి ఒక్కరూ పూనుకోవా లని బిక్నూర్ యూనిట్ అధికారి ఏ. రవికుమార్ విజ్ఞప్తి చేసారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి