సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం

నల్లగొండ నర్సన్న నాకు సోదరుడి లాంటి వాడు.. నా ఆహ్వానం మేరకే అచ్చంపేట సభకు వచ్చారు

సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం

అచ్చంపేట : నిన్న అచ్చంపేట పట్టణంలో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో ప్రముఖ కవి, గాయకులు నర్సిరెడ్డి (నల్గొండ గద్దర్) తనను అవమానపరిచినట్టుగా కొంతమంది ప్రతిపక్ష, దుష్టశక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఇది అబద్ధం, అవాస్తవమని స్పష్టం చేశారు.సభా వేదికపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్న క్రమంలో నల్గొండ గద్దర్ తన దగ్గరికి వచ్చి ఒక నిమిషం మాట్లాడి, పాట పాడుతానని అడగడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.వాస్తవం తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యేగా తన గెలుపు కోసం ప్రచార పాటలు పాడిన వ్యక్తి నల్గొండ గద్దర్ అని గుర్తుచేశారు. అచ్చంపేట పట్టణంలో మహా బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా పాల్గొన్న వ్యక్తి కూడా ఆయనేనని తెలిపారు.తామిద్దరం ఎంతో సోదరభావంతో అన్నదమ్ముల లాగా ఉంటామని, తన ఆహ్వానం మేరకే అచ్చంపేట భారీ బహిరంగ సభకు రావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మానుకోవాలని హితవు పలికారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి