భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ * – *గండ్రత్ సుజాత, ఏ ఎం సి చైర్మన్ బోరంచు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భారతరత్న, భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత ,అదిలాబాద్ మార్కెట్ చైర్మన్బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి , మాజీ డీసీసీ సాజిద్ ఖాన్ ,జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని విజయ డైరీ పక్కన ఉన్న విజ్ఞాన్ స్పెషల్ స్కూల్‌ను సందర్శించి, అక్కడి చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా గండ్రత్ సుజాత, ఏ ఎం సి చైర్మన్ బోరంచు లు మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడని కొనియాడారు. ఎన్నో సవాళ్లతో స్వాతంత్ర్యం పొందిన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన పటిష్టమైన పునాదులు వేశారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టి, 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్యుత్, ఉక్కు, భారీ పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేశ ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని వివరించారు. అదేవిధంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య పరిశోధన రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యతనిచ్చారని, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా, వైద్య సంస్థల ఏర్పాటుకు ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని తెలిపారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పరిశోధనా సంస్థలు, జాతీయ ప్రయోగశాలల అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, లౌకికవాదం, సామాజిక సమానత్వం, మహిళల హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నెహ్రూ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నేటి ఆధునిక భారతదేశ అభివృద్ధిలో ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవని అన్నారు. ముఖ్యంగా పిల్లలే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన నెహ్రూ గారికి చిన్నారులంటే ఎంతో ప్రేమ అని, ఆయన జన్మదినమైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించినప్పుడే బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని అన్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ స్పెషల్ స్కూల్లోని చిన్నారులతో బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రేమ, ప్రోత్సాహం, విద్య అందించి వారి భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని గండ్రత్ సుజాత, ఏ ఎం సి చైర్మన్ బోరంచు లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా,ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ , జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార. జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ మీర్జా ఇమ్రాన్ బేగ్,జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దేవిదాస్ చారి,మావాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ ,జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ లు అక్తర్ అలీ, మందకిని ,intuc జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్, సేవాదళ్ ఆఫ్సర్,పట్టణ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వార్డ్ ప్రెసిడెంట్ లు, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


