సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి
ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేసిన ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్త సురేందర్
ములుగు, : వేలం పాటకు వేసిన ద్విచక్ర వాహనాల ప్రతి భాగాన్ని రెండు భాగాలుగా విడదీసే వేలం వేయాలని ములుగు మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ కొత్త సురేందర్ ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ములుగు ఎక్సైజ్ అధికారి ఏఈఎస్ శ్రీనివాస్ గారికి, ములుగు ఎక్సైజ్ సీఐ సుష్మత గారికి వినతిపత్రం అందజేశారు. ఈరోజు జరుగుతున్న ద్విచక్ర వాహనాల వేలంపాటను ఉద్దేశించి కౌన్సిలర్ కొత్త సురేందర్ మాట్లాడుతూ, గతంలో కూడా చాలాసార్లు సీజ్ చేసిన వాహనాలకు ఎక్సైజ్ శాఖ వేలంపాటలు వేసి నామమాత్రంగా చేతులు దులుపుకుంటోందని అన్నారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం వాహనానికి ఉన్న ప్రతి భాగాన్ని రెండు భాగాలుగా చేసి వాహనాన్ని వేలంపాట వేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ జీవోల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. ఇలా చేయకుండా సీజ్ చేసిన వాహనాలను నామమాత్రంగా కట్ చేసి మళ్లీ వినియోగదారులు వాహనాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం ప్రభుత్వ జీవోలకు విరుద్ధమని అన్నారు. సీజ్ చేసిన వాహనాలను మళ్లీ వినియోగదారులు, వాహనదారులు వినియోగించుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని అన్నారు. కావున గతంలో జరిగిన అటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి, ములుగు మున్సిపాలిటీ కంటెస్టెంట్ సతీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


