మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్–I డీఐజీ అంబర్ కిషోర్ ఝా.

మారుమూల ప్రాంతం కావడంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్–I డీఐజీ అంబర్ కిషోర్ ఝా.

భూపాలపల్లి :  మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను శనివారం కాళేశ్వరం జోన్–I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను క్రమం తప్పకుండా పాటించాలని సిబ్బందికి సూచించారు.వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమపద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో 5S విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి,అన్ని రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించడంతో పాటు స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం ఎస్‌ఐ,స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి కేసుల వివరాల ఆన్‌లైన్ నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు,గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతలు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. మహాముత్తారం పోలీస్ స్టేషన్ మారుమూల ప్రాంతంలో ఉన్నందున పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీఐజీ సూచించారు. సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణా,ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్ల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ,వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని,పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలని డీఐజీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి