తాడిచెర్లలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ
మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చెక్కులు అందజేత సర్పంచ్ బండి స్వామి,
మల్హర్, : మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, వార్డు సభ్యుడు ఇందారపు చంద్రయ్య, మాజీ వార్డు సభ్యుడు సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడాకుల సమ్మయ్య, గంగయ్య పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.చెక్కులు పొందిన లబ్ధిదారుల వివరాలు, మేనం నారాయణ – రూ.39,000, సిద్ధుల సరూప – రూ.40,000,ఇందారపు రాజమల్లు – రూ.47,500, బోడ నీల రూ.35,000,మొత్తం నలుగురు లబ్ధిదారులకు రూ.1,61,500 విలువైన సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


