మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, జేసీబీ వాహనాన్ని ధ్వంసం చేసి ఉద్యోగిపై రాళ్లతో దాడి చేసిన తండ్రి, కుమార్తె అరెస్ట్.

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.*మావల ఇన్స్పెక్టర్ బీడీ ప్రేమ్ కుమార్

మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, జేసీబీ వాహనాన్ని ధ్వంసం చేసి ఉద్యోగిపై రాళ్లతో దాడి చేసిన తండ్రి, కుమార్తె అరెస్ట్.

ఆదిలాబాద్ బ్యూరో  : ఆదిలాబాద్ పట్టణంలోని మావల సర్వే నంబర్ 170లో గల 2BHK ఇళ్ల సమీపంలో ఈరోజు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఉదయం జరిగింది. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది జేసీబీ వాహనంతో ఆక్రమణల తొలగింపు చేపడుతుండగా, భోయర్ మధుకర్, అతని కుమార్తె అనుష్రీ విధులకు ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో మధుకర్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు మున్సిపల్ జేసీబీ వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో క్రాంతి అనే మున్సిపల్ ఉద్యోగికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మావల పోలీసులు నిందితులైన తండ్రి, కుమార్తెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను చట్టబద్ధంగా నిర్వహిస్తున్న సమయంలో ఆటంకం కలిగించడం, దాడులకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మావల ఇన్‌స్పెక్టర్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. నిందితుల వివరాలు:

  • భోయర్ మధుకర్ (52), s/o భోయర్ బాపురావు, నివాసం రవీంద్రనగర్, ఆదిలాబాద్.
  • భోయర్ అనుష్రీ (21), s/o భోయర్ మధుకర్, నివాసం రవీంద్రనగర్, ఆదిలాబాద్.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి