కూనిపూర్ గ్రామం లో భూ సర్వే ను పరిశీలించిన కలెక్టర్.
వేసవి లో రైతుల ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని సర్పంచు కు సూచించిన కలెక్టర్.......
బాన్సువాడ : కొనిపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే ను శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పరిశీలించారు. భూ భారతి రీ సర్వేలో భాగంగా వర్ని మండల్ కూనీపూర్ గ్రామాని కి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, బోధన్ రెవెన్యూ అధికారి ప్రశాంత్ కుమార్ విచ్చేయడం జరిగింది. భాగంగా జిల్లా కలెక్టర్ భూ రీ సర్వే ను పర్సిలించి, సర్వేను వేగ వంతంగా నిర్వహించాలని చూచిస్తూ, గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ తో మాట్లాడుతూ. రైతులు ఆరు తడి పంటలు వేసుకునేలా చూడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్, గిర్ధవర్, గ్రామ పంచాయతీ అధికారి, మండల సర్వేర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

