కోర్పోల్ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రూ.1.90 లక్షల ఆర్థిక సాయం మంజూరు.. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి
చౌటకూర్, : చౌటకూర్ మండలం పరిధిలోని కోర్పోల్ గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1,90,000 ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేయాలని నాయకులు తెలిపారు. ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సంజయ్ కుమార్, దానంపల్లి బాలయ్య, కటిక శంకర్, భోగిని సాయిలు, కటికే లక్ష్మణ్, పొట్టేల శ్రీనివాస్, మన్నె సుధాకర్, మోహన్, దానంపల్లి శ్రీనివాస్, మురళీధర్ రెడ్డి, కాసాల మల్లారెడ్డి, గజాడ నరం రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

