మల్లన్న ఆలయ హుండీ ఆదాయం 74,46,087
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి 71 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. స్వామివారికి భక్తులు సమర్పించిన 74,46,087/-రూపాయలు. విదేశీ కరెన్సీ- 44 నోట్లు, మిశ్రమ బంగారము , వెండి లభించింది. అనంతరం సీలు వేసి తిరిగి హుండీ నందు భద్రపర్చనైనది.హుండీ లెక్కింపు లో శివ రామ కృష్ణ భజన మండలి సమితి సేవ సభ్యులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ టి శ్రీకాంత రావు , శ్రీ వి విజయ రామారావు ,AC మెదక్ , శ్రీమతి పి విజయలక్ష్మీ, ఇన్స్పెక్టర్, సిద్దిపేట డివిజన్, బుద్ది శ్రీనివాస్ సహాయకార్యనిర్వహణాధికారి,పర్యవేక్షకులు ఎన్ చంద్రశేఖర్ ,యు చంద్రశేఖర్ మరియు సిబ్బంది , అర్చకులు , పోలీస్ సిబ్బంది , ఎస్ బి ఐ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

