కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా - మంత్రి పొన్నం ప్రభాకర్

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ :  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఏడుకొండల స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మేలు జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.గతంలో అనేక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్న ఏడుకొండల స్వామి కరుణతో ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలని ఆకాంక్షించారు.ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో అర్హులైన ప్రజలకు అందాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.సర్వే జనాః సుఖినో భవంతు అనే గొప్ప భావనతో ప్రజలందరూ సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Views: 83

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి