ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
*గ్రామ సర్పంచ్ కొనదొడ్డి ఆనందం ఆధ్వర్యంలో విద్యార్థులకు హక్కులపై అవగాహన.
రేగోడు (మెదక్ ): రేగోడు మండలంలోని టి.లింగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొనదొడ్డి ఆనందం ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రత్యేక సభ నిర్వహించి బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల భవిష్యత్తు, సమాజంలో వారి బాధ్యతల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ పట్లోళ్ళ శివాజీ రావు,ఉప సర్పంచ్ పట్లోళ్ళ అమృత్ రావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిందుల జైపాల్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి ధరమ్ సింగ్,వార్డు సభ్యులు కిష్టమ్మ,నిర్మల, సంధ్య రాణి, ఖాజా మియా,అంగన్వాడీ టీచర్ ప్రేమల, ఐకేపీ సీసీ లు రాములు, పూలమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ రావు,జనార్దన్, ఆశ వర్కర్ పాలమ్మ,పిఈటీ రాజశేఖర్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


