రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి

హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు అయిలేని మల్లిఖార్జున్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన రైతు కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న రైతు బీమా డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన తో రైతు బీమా పథకాన్ని. గత ప్రభుత్వం తీసుకరావడం జరిగింది అప్పటినుండి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ 2026 ఆగస్టు నెల వరకు మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా చెల్లించినాది కానీ ఆగస్టు నెల నుండి మరణించిన రైతు కుటుంబాలకు . బీమా. డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టీనాది ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు హుస్నాబాద్ డివిజన్ లో దాదాపు 41 మంది రైతులు మరణించినారని,కేవలం మరణించి రైతుల పేర్లను మాత్రమే నమోదు చేసుకోని డబ్బులు పెండింగ్ లో పెట్టినారన్నారు. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు ఆకస్మికంగా మరణిస్తే మరణించిన రైతు కుటుంబాలకు ఓక బరోసా లాగా రైతు బీమా పథకం ఉంది అనే ధైర్యం ఉండేది కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని పెండింగ్ లో పెట్టడం వలన రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని,ప్రజల కోసం ఇంటి ఇంటి కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుక వచ్చిన కూడా రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతులను ఆదుకోవాలి కానీ ఒక పథకాన్ని తీసుక వచ్చి ఉన్న పథకాన్ని రద్దు చేయద్దు అని ప్రభుత్వన్నీ కోరుతున్నాం అదేవిధంగా ఆగస్టు నెల నుండి మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా వచ్చే పెండింగ్ లో ఉన్న డబ్బులు చెల్లించి మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి పక్షాన రాష్ట్ర ప్రభుత్వన్నీ కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు బత్తుల కొమురయ్య పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి