హిందూ వాహిని మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జిల్లా సంయోజక్ గా కర్ణకంటి రవీందర్
మంచిర్యాల(క్రైమ్) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ పోచమ్మ దేవాలయంలో శుక్రవారం హిందూ వాహిని సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి ముడుపు యాదిరెడ్డి, ప్రాంత యువ వాహిని సంయోజక్ పైతరి రాజు హాజరయ్యారు. హిందువుల ఐక్యత, హిందూ సమాజ సంఘటితం కోసం మంచిర్యాల జిల్లా, నగర కమిటీలను ఈ సందర్భంగా ప్రకటించారు. జిల్లా సంయోజక్‌గా కర్ణకంటి రవీందర్‌ను ఎన్నుకోగా, సహా సంయోజక్‌లుగా రామగిరి శ్రీనివాస్, దండవేని శ్రీదర్, కూచి సుమలత (అడ్వకేట్), ఎర్రం తిరుపతిలను నియమించారు.అదేవిధంగా మంచిర్యాల నగర కమిటీ సంయోజక్‌గా కీర్తి నవీన్‌తో పాటు నగర కమిటీ బాధ్యులుగా రామగిరి మణికంఠ, సాయి, మల్క ప్రతాప్, నాగారపు సంతోష్, అమిత్ కృష్ణ, సాయి దీక్షిత్, సందీప్, బత్తుల సందీప్‌లను ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా, నగర కమిటీ బాధ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. హిందూ ఐక్యత కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


