బిజినేపల్లిలో కల్లు మత్తు పదార్థం పట్టివేత!

దాదాపు కిలో అల్ప్రజోల్ స్వాధీనం - ఈగల్ టీం, పోలీసుల మెరుపు దాడి

బిజినేపల్లిలో కల్లు మత్తు పదార్థం పట్టివేత!

బిజినేపల్లి, నాగర్ కర్నూల్ :  నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో అక్రమ మత్తు పదార్థం నిల్వలపై అధికారులు దాడి చేశారు. శనివారం వచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఈగల్ బృందం, బిజినేపల్లి పోలీసులు సంయుక్తంగా ఓ ఇంట్లో సోదా నిర్వహించారు. ఈ తనిఖీల్లో పొడి రూపంలో ఉన్న దాదాపు ఒక కిలో అల్ప్రజోల్ బయటపడింది. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కల్లులో కలిపి మత్తును పెంచడానికి ఈ పదార్థాన్ని వినియోగిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇదే మండల కేంద్రంలో మరోసారి ఇలాంటి పదార్థం దొరకడంతో స్థానికుల్లో చర్చ మొదలైంది.ఈ పదార్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి కోసం నిల్వ ఉంచారు అనే అంశాలపై విచారణ జరుగుతోందని, అలాగే దీని వెనుక ఎవరున్నారనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ