అనారోగ్యంతో వ్యక్తి ఆకస్మిక మృతి

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం.. గ్రామంలో విషాదఛాయలు

అనారోగ్యంతో వ్యక్తి ఆకస్మిక మృతి

మల్హర్ : మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన బెల్లంకొండ శ్యామ్ (48) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన అంబులెన్స్‌లో భూపాలపల్లిలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన శ్యామ్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది. కుటుంబ పోషణకు ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఉన్నట్టుండి చోటుచేసుకున్న ఈ ఘటనతో కొండంపేట గ్రామంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. శ్యామ్ మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబ పరిస్థితిని పరిశీలించి తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి