ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:

నల్లగొండ :   మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి,బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ190 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో స్త్రీలకు విద్య పూర్తిగా నిషేధించిన రోజుల్లోనే,తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించి,51 పాఠశాలలు నెలకొల్పి మహిళల్లో చైతన్యం కల్పించిన గొప్ప నాయకుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో బాంబే నగరంలో లక్షలాదిమంది సమక్షంలో "మహాత్మా"బిరుదు పొందిన గొప్ప నాయకుడని,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సైతం జ్యోతిరావు పూలే రచనలు చదివి "అంబేద్కర్ నా గురువు"అని ప్రకటించారని తెలిపారు.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు సిద్ధించేంతవరకు బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలోబీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్,ఎం.సైదులు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ళ విజయ్ కుమార్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోక నాబోయిన రమణ ముదిరాజ్,బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు లకుడాపురం వెంకన్న, బక్కతట్ల వెంకన్న యాదవ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లిపోయిన సతీష్ యాదవ్, కాశీపతి వెంకన్న,మచ్చ గిరి వెంకన్న యాదవ్,కస్తూరి రవీందర్,మిర్యాల వెంకన్న, తమ్మిశెట్టి మల్లేష్,యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి