ఉన్నత పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ
లింగాల గణపురం (జనగాం) కళ్ళెం : లింగాలగణపురం మండలం కళ్ళెం గ్రామం లో గల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో దళితరత్న డా.మబ్బు పరశురామ్ లెక్చరర్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో పాటు చదువులో రాణించాలి,విలువలతో కూడిన విద్య కుటుంబ గౌరవాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుంది.అలాగే విద్యార్థులు అందరూ ఈ స్టడీ మెటీరియల్ ని ఉపయోగించుకుంటూ బాగా చదివి పాఠశాలకు,గ్రామానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఎవరైతే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారో వారికి పై చదువుల కొరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అని మాట్లాడారు.అదే విధంగా గత మార్చి లో అధిక మార్కులు సాధించిన చీటీ కోడూరు వర్ష కి ఆర్థిక పారితోషికంగా నగదు రూపంలో 5000/- రూపాయలు ఇవ్వడం జరిగింది.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు పరశురామ్ గారికి చిరు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి,ఉప సర్పంచ్ ఆరె సంపత్, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ రామలక్ష్మీ,దేవస్థాన ఛైర్మన్ జిల్లాల వెంకట్ రెడ్డి,AMC మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్, మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాస్ రెడ్డి,BJR సంఘం అధ్యక్షుడు డా.మబ్బు కరుణాకర్, వార్డు మెంబర్ మబ్బు క్రాంతి కుమార్, స్నేహ యూత్ అధ్యక్షుడు తిప్పారపు ప్రసాద్,మబ్బు ఆదాం,నక్కీర్త మహేష్,బాల్నే శేఖర్,మబ్బు అశోక్,మబ్బు నాగేష్,మబ్బు జయసూర్య మరియు విద్యార్థులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేసారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

