సాలూరలో కోతుల స్వైరవిహారం.. భయాందోళనలో ప్రజలు

సాలూరలో కోతుల స్వైరవిహారం.. భయాందోళనలో ప్రజలు

సాలూర మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వారిని తీసుకెళ్లే తల్లిదండ్రులు కోతుల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఎల్మా రమేష్‌పైకి కోతులు రావడంతో ఆయన భయపడి ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి తీవ్ర గాయమై ఎముక విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపైకి దూసుకొస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్లపై నడవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా కోతుల బెడద ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కోతులను పట్టించి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రజలకు మరియు పాఠశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 123

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి