మంజీరా నదిలోకి బీర్ పరిశ్రమ వ్యర్థ జలాలు? విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అలీం ఫిర్యాదు

మంజీరా నది కాలుష్యంపై ఆందోళన.. వ్యర్థ జలాల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని వినతి

మంజీరా నదిలోకి బీర్ పరిశ్రమ వ్యర్థ జలాలు? విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అలీం ఫిర్యాదు

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని శివ్వంపేట మంజీరా నదిలోకి బీర్ పరిశ్రమ నుంచి కలుషిత వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉమ్మడి పుల్కల్ మండల ఎంపీపీ కోఆప్షన్ సభ్యుడు అలీం జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంజీరా నది పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటికి, రైతులకు సాగునీటికి ప్రధాన ఆధారంగా ఉందని తెలిపారు. అయితే బీర్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థ జలాలను మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.దీంతో నది నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంతో పాటు పశువులు, పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వ్యర్థ జలాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, శుద్ధి చేయని నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పరిశ్రమకు ఉన్న కాలుష్య నియంత్రణ అనుమతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల నీటి భద్రతను దృష్టిలో ఉంచుకొని మంజీరా నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని అలీం విజ్ఞప్తి చేశారు.

Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి