మృతి చెందిన జర్నలిస్ట్ రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి - బీఎస్పీ డిమాండ్
జర్నలిస్ట్ కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం ఇవ్వాలి - రవీందర్ గౌడ్ కాశబోయిన రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్పీ నేతలు జర్నలిస్ట్ రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి l
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలం గొల్లగుంట గ్రామానికి చెందిన విలేకరి కాశబోయిన రవీందర్ గత నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగిందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి కుటుంబానికి ఆయనే జీవనాధారమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి, అదే విధంగా ఏదైనా అవుట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతున్నామన్నారు. పరామర్శించిన వారిలో నాయకులు ఎలుకంటి శ్రీనివాస్ రెడ్డి, గొల్లగుంట మాజీ సర్పంచ్ కాశబోయిన మహేందర్ తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

