కళ్లెం గ్రామ లబ్ధిదారులకు చేయూత పింఛన్లు,
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
*ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నగదు జమ* లింగాల గణపురం (జనగామ జిల్లా)లింగాల గణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్లెం గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి, దేవస్థాన చైర్మన్ మూర్తి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగాల సంపత్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు యాకూబ్ పాషా, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బాల్నే శేఖర్, కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షులు రూబెన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


