పట్టభద్రులు ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవితమ్మ, పార్టీ పెట్టక ముందు నుండి బిసి బిడ్డలకు ముందుండి వారి హక్కుల కోసం బహుజన పాలన కోసం పోరాడుతుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాష్ కొల్లూరు ని ప్రకటించడం జరిగింది. విద్యావంతుడు, పట్టుదలగల యువకుడు, నేషనల్ ఛానల్ జర్నలిస్టుగా కొనసాగి.. ప్రజలకు చేరువగా తన వంతు సామాజిక బాధ్యత తీసుకొని ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో రాజకీయంగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడం జరిగింది. ఎన్ని పార్టీలు పాలించిన ఒక కుమ్మరి (బిసి కులానికి) న్యాయం జరగలేదు. కానీ కవితమ్మ కుమ్మరి (బిసి కులానికి) చెందిన అభ్యర్థిని ప్రకటించడం కవితమ్మ , బిసి బిడ్డలకు అవకాశం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యావంతులారా ఆలోచించండి. ప్రశ్నించే వ్యక్తికి పట్టం కడదాం.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఆకాష్ కొల్లూరు కి ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


