నెల్లుట్లలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులను సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
లింగాల గణపురం (జనగాం) : లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ, గేదెలు, ఆవులు పెంచుతున్న పశుపోషకులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా పశువులకు నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా వాటిని నట్టల సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపునకు కూడా పశుపోషకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యుడు కొయ్యడ అనిల్, వెటర్నరీ వైద్యులు వాసు, శైలజ, రైతులు, పలువురు పశుపోషకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

