గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తాటి, ఈతవనానికి బ్రిడ్జి, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించాలి

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కోరారు.పొట్లపల్లి రోడ్డు వైపు దామరకుంట సమీపంలో ఉన్న తాటి, ఈత వనాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం కట్టకు గండి పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కార్మికులు వనాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని వివరించారు.గీత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అక్కడ బ్రిడ్జి నిర్మించడంతోపాటు తాటివనం నుంచి గుట్ట కింది ఎల్లమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. ఈ పనుల కోసం కనీసం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దామరకుంటను కబ్జాల నుంచి పరిరక్షించి, చెరువు హద్దులు నిర్ణయించాలని కోరారు.హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కమిటీ హాల్ నిర్మాణం కోసం ఐదు గుంటల స్థలం కేటాయించడంతోపాటు రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గీత కార్మికులు పూదరి రాజు, మొలంగూర్ శ్రీనివాస్, కోయడ బాలయ్య, పూదరి మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, తాళ్లపల్లి రాజయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్, బబ్రు రవీందర్, సుధగోని కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 154

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ