కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసులు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో వివాదం

కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసులు

సీపీ కార్యాలయం, కలెక్టరేట్‌ నుంచి వివరణ కోరుతూ నోటీసులు

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేశ్‌కు ఉన్నతాధికారుల నుంచి షోకాజ్‌ నోటీసులు అందినట్లు తెలిసింది.  గత కొన్ని నెలల క్రితం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు సమావేశాల నిర్వహణపై ఇచ్చిన ఫిర్యాదులు ఇందుకు కారణంగా తెలుస్తోంది.  సెప్టెంబరు 23న మున్సిపల్‌ సమావేశ మందిరంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారని, చైర్‌పర్సన్‌ భర్త ఆమె చాంబర్‌లో కూర్చొని సీసీ కెమెరాల ద్వారా సమావేశాన్ని పర్యవేక్షించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌కు చెందిన 14 మంది కౌన్సిలర్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాకు ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలో  షోకాజ్‌ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అక్టోబరు నెలలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదని కౌన్సిలర్లు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు మరో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కలెక్టరేట్‌ నుంచి కూడా కమిషనర్‌కు నోటీసులు వచ్చినట్లు తెలిసింది. నోటీసుల విషయమై కమిషనర్‌ను వివరణ కోరగా, ఉన్నతాధికారుల నుంచి సమాధానం ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని, వాటికి వివరణ ఇస్తామని తెలిపారు. నోటీసుల ప్రతులు కోరగా సమాచార హక్కు చట్టం ద్వారా పొందాలని చెప్పడం విడ్డూరంగా ఉంది  మున్సిపల్‌ సమావేశ మందిరంలోకి మీడియాను అనుమతించని అధికారులు, గుర్తుతెలియని వ్యక్తి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడంపై అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వరుస ఫిర్యాదులు, నోటీసుల వ్యవహారం మున్సిపల్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ