పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభం

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయం దోహదం: వక్తలు

పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభం

గ్రామం: పాలెం మండలం: బిజినపల్లి జిల్లా: నాగర్ కర్నూల్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, విజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ విజ్ఞాన, సాహిత్య పుస్తకాలను చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవేందర్ రెడ్డి, పూర్ణచంద్రకళ, తిరుపతమ్మ, రాజు, సాయిశంకర్, గాయత్రి, శ్రీదేవి, జహీరా, శివశంకర్, రమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ