వట్టెం వెంకన్నకు వైభవంగా పల్లకిసేవ
బిజినపల్లి (నాగర్ కర్నూలు) : నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారితో పాటు భూదేవి, శ్రీదేవి అమ్మవార్లకు పల్లకిసేవ అంగరంగ వైభవంగా జరిగింది. పల్లకిసేవను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కల్యాణం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు పూలు, పండ్లు, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


