వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
హైదరాబాద్ : డైలీ తెలుగు దిన పత్రిక ఎడిటర్ నరేందర్ , తెలంగాణ, ఆంధ్ర ఉభయ రాష్ట్రాల ఇన్చార్జి మహేశ్వర రావు లను ములుగు జిల్లా పాత్రికేయ మిత్రులు శనివారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని విజన్ ఆంధ్ర హెడ్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎడిటర్ నరేందర్ కు, ఇన్చార్జి మహేశ్వర రావుకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎడిటర్ నరేందర్ మాట్లాడుతూ, వార్తలు రాసే విధానంపై పాత్రికేయులకు మార్గదర్శకాలు చేశారు. నిజాయితీ, నిష్పక్షపాత వార్తలే పత్రిక అభివృద్ధికి పునాది అని, గ్రామస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలేకరులే పత్రికకు నిజమైన బలమని, ప్రతి వార్త క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి, రెండు వైపులా అభిప్రాయాలు తీసుకొని రాయాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రతినిధి ఆవుల వెంకన్న, పిలక వెంకట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ దాసరి నారాయణరావు, నూతి వెంకటేశ్వర్లు, గోల్కొండ మహేష్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


