బాల్కొండ వాసులకు అత్యంత గౌరవం
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :- ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజా స్వామ్య మానవ హక్కుల కౌన్సిల్, సమాచార చట్టానికి వివిధ ప్రాంతాలకు బాద్యులని నియమించడం జరిగిందని ఉమ్మడి జిల్లాల ప్రజా స్వామ్య మానవ హక్కుల కౌన్సిల్, సమాచార చట్టాo(ఆర్. టి. ఐ) అధ్యక్షులు,ఉపాధ్యక్షులు బ్రహ్మరౌతు నర్సింగ్ రావు, డాక్టర్ పవన్ కుమార్ శనివారం రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలలో పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లాలో మానవ హక్కులకోసం అలాగే సమాచార హక్కు చట్టం పరిధిలో ప్రజా సమస్యలపై స్పందించే నిస్నార్థులని గుర్తించడం జరిగిందని వారు వివరించారు.ఉమ్మడి జిల్లా లోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గలతో పాటు మండలాలకు నియామకాలు పొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి, కామారెడ్డి జిల్లా కేంద్రం అధ్యక్షులుగా రాజ్ కుమార్,(కామారెడ్డి)ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులుగా లింగం,(లింగం పేట్)మద్నూరు బిచ్కుంద అధ్యక్షులుగా రమేష్,(బిచ్ కొండ)బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులుగా శ్రీనివాస్,(బోధన్)ఉమ్మడి నిజామాబాదు జిల్లా కార్యవర్గ సభ్యులుగా జంగం జగదేశ్వర్(బాల్కొండ) బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు గా కాలరవి(బాల్కొండ),కమ్మర్పల్లి మోర్తాడ్ మండలాలకు అధ్యక్షులుగా కుండ శేఖర్ (పాలెం),బాల్కొండ మండల అధ్యక్షులుగా తోటనవీన్ (బాల్కొండ) నియమించడం జరిగిందని వారు వివరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు, పవన్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లోని మనవ హక్కుల సంరక్షణ తో పాటు వివిధ కార్యాలయాల్లో పౌర హక్కుల సమాచారం కోరేందుకు ఆర్టిఐ చట్టం పరిధిలో సమాచారం కోరాలని ఈ సందర్భంగా నియామo పొందిన బాధ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిర్మల్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కామారెడ్డి రెండు జిల్లాల స్థాయి ఒకరోజు సెమినార్ ను నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఇందులో నియామకం పొందిన బాధ్యులు తమ బాధ్యతలపై సెమినర్ లో వివరించడం జరుగుతుందని,ఈ సెమినార్ లో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు తో పాటు ఇతర అధికారులతో పాటు హైకోర్టు న్యాయవాదులు పాల్గొనచున్నారని నర్సింగ్ రావు పవన్ కుమార్ వివరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


