తీన్మార్ మల్లన్న కార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ బిజినపల్లి అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : తీన్మార్ మల్లన్న బీసీ పాదయాత్రలో భాగంగా నిన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మల్లన్న కార్ పై జరిగిన దాడిని నిరసిస్తూ, ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో పూలే అంబేద్కర్ చౌరస్తాలో మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీసీ నాయకులందరూ ముక్తకంఠంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొంటున్న వ్యక్తులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం లేదా శారీరకంగా హాని కలిగించడానికి ప్రయత్నించడం అత్యంత తీవ్రమైన విషయమని, ఇలాంటి ఘటనలపై చట్టాన్ని అమలు చేసే అధికారులు అత్యంత ప్రాధాన్యంతో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మల్లన్నను రాజకీయంగా ఎదుర్కోలేక, బీసీ ఉద్యమాన్ని నిలుపు చేయాలనే పథకం ప్రకారమే లారీతో కారును గుద్దారని ఆరోపించారు. ఇది హత్యాయత్నమేనని, బీసీ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న గారికి భద్రత సిబ్బందిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కుమ్మరి శ్రీశైలం, అబ్బ తిరుపతయ్య, మ్యాకల యాదయ్య, ఇండ్ల మల్లికార్జున్, ఆవుల కృష్ణ, దాసర్ల శ్రీనివాసులు, చిర్ణం శివయ్య యాదవ్, కొమ్ముల చిన్న నిరంజన్, పల్లె సత్యం, శసాని సంతోష్ సాగర్, చిర్ణం తిరుపతయ్య, అతినారపు బాల్ లక్ష్మయ్య, నరేందర్ గౌడ్, పిట్టల తిరుపతయ్య, నక్క పర్వతాలు యాదవ్, ఊరుకొండ రఘు బాబు, ఉప్పనమొని శ్రీను, అప్పల మాసయ్య యాదవ్, అంతటి రాజేందర్ గౌడ్, అబ్బ కర్ణాకర్, అప్పల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


