ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు : ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తో నవంబర్ 16, 17 తేదీల్లో చేపట్టనున్న 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం ములుగు పట్టణంలో బీజేపీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాపారులు, భవన యజమానులను కలిసి పన్నుల భారాన్ని వివరించి, దీక్షకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, ముందస్తు సమాచారం, ప్రజాభిప్రాయం లేకుండా పన్నులు పెంచడం అన్యాయమన్నారు. పన్నుల పెంపుతో చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, ప…
Read more
6:26 pm
Forwarded
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ చౌట్కూర్, నవంబర్ 14 (విజన్ ఆంధ్ర):- సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామంలో శనివారం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులకు వివిధ రకాల వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా మొత్తం 53 గేదెలు, 9 ఆవులు, 50 దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. అలాగే గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు నిర్వహించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపొందించేందుకు పశుపోషకులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా VB-G RAM G పథకం ద్వారా పశుగ్రాసం సాగు చేసుకునే విధానం, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, పశుపోషకులకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి వివరించారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Nov 2026 19:38:04
ములుగు : ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
