మంట కలుస్తున్న బంధుత్వం
- ధర్మేఛ, అక్షేచ ,నాతిచరామి అంటూ భర్త చేతి పట్టుకొని ఏడడుగులు నడిచిన భార్య, భర్తను హత్య చేసిన ఘటన - అక్రమ సంబంధాలే హత్యలకు కారణం -డీఎస్పీ విట్టల్ రెడ్డి
కామారెడ్డి బ్యూరో : అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తని, ఇతరులతో కలిసి భార్య చంపడం భార్యాభర్తల బంధుత్వం మంటగలుస్తుంది, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై డి.ఎస్.పి విట్టల్ రెడ్డి వివరాలు తెలిపారు.అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యతో పాటు మరో ఇద్దరు కలిసి భర్తను హత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మద్యం సేవించేందుకు తీసుకెళ్లి నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశారని,సాంకేతిక ఆధారాలతో కేసును బాన్స్వాడ పోలీసులు వేధించారు.
- వివరాలు వెల్లడించిన బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి
తేదీ 23.10.2026 రాత్రి హన్మాజీపేట్ గ్రామ శివారులోని పచ్చేరు చెరువు వద్ద చాకలి @ గుమ్మడి కాశిరాం (26) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి చాకలి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో Cr.No.437/2026 U/s 194 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం ప్రాథమిక వైద్య నివేదిక ఆధారంగా ఇది హత్యగా నిర్ధారణ కావడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల దృశ్యాలు తదితర ఆధారాలను విశ్లేషిస్తూ పోలీసులు కేసును ఛేదించారు.తేదీ 30.10.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హన్మాజీపేట్ గ్రామంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి.
- కేసు వివరాల్లోకి వెళితే...
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, A3 గుమ్మడి సవితకు A1 చింతకింది రాము, A2 పసుపుల సంతోష్‌లతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తన భర్త కాశిరాంను హత్య చేయాలని పథకం రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ పథకం ప్రకారం 23.10.2026 రాత్రి కాశిరాంను మద్యం సేవించేందుకు తీసుకెళ్లారు. అతను మద్యం మత్తులో ఉన్న సమయంలో A1 రాము నైలాన్ తాడుతో అతని మెడకు బిగించి హత్య చేయగా, A2 సంతోష్ అతను తప్పించుకోకుండా చేతులను గట్టిగా పట్టుకుని సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా హన్మాజీపేట్ గ్రామ శివారులోని పచ్చేరు చెరువులో పడవేసి, నేరానికి ఉపయోగించిన వస్తువులు, ఇతర ఆధారాలను తొలగించి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హత్యకు సంబంధించిన కుట్రలో A3 సవిత కూడా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
- నిందితుల వివరాలు:
1. A1. చింతకింది రాము S/o పోచయ్య, వయస్సు 26 సంవత్సరాలు, హన్మాజీపేట్ గ్రామం, బాన్సువాడ మండలం.
2. A2. పసుపుల సంతోష్ S/o సాయిలు, వయస్సు 25 సంవత్సరాలు, హన్మాజీపేట్ గ్రామం, బాన్సువాడ మండలం.
3. A3. గుమ్మడి సవిత W/o కాశిరాం, వయస్సు 25 సంవత్సరాలు, హన్మాజీపేట్ గ్రామం, బాన్సువాడ మండలం.
నిందితులను విచారించిన అనంతరం నేరానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు జిల్లా డిఎస్పి తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి, కీలక ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ టి. శ్రీధర్, క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పృథ్వీకుమార్, పాండురంగ, సుదర్శన్ రావులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ప్రత్యేకంగా అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


