కేంద్ర రాష్ట్ర నిధులు దుర్వినియోగం చేస్తే ఊరుకోనేది లేదు

బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :- నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నిధుల్ని దుర్విని యోగం చేస్తే ఊరుకునే లేదని,నిజామాబాదు జిల్లా ప్రజా స్వామ్య మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు,ఉపా అధ్యక్షులు డా, పవన్ కుమార్ శనివారం పత్రికలకు విడిదల చేసిన ప్రకటనలో అధికారులకు విజ్ఞప్తి చేసారు.బాల్కొండ నియోజక వర్గంలో ఆయా గ్రామాల్లో చేయని పనులకు పూర్తి చేసారని "సాoకేతిక ధ్రువ పత్రాలు జరిచేసే పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, అలాగే " యిటిలైజెషన్ "ధ్రువపత్రాలు " జారీ చేసె  మండల,జిల్లా అధికారుల్ని సమాచార చేట్టం పరిధిలో జవాబు ధారితనం కోసం సిద్ధమై ఉండాలని వారు విజ్ఞప్తి చేసారు. బాల్కొండ నియిజిక పరిధిలో ఆయా గ్రామాల్లో జరిగే పనులు తూ.. తూ...పద్ధతి లో పనుల నాణ్యత లో నిబందనాలు పాటించ కుండ  " సాoకేతిక మరియు - యిటిలైజెషన్ "ధ్రువపత్రాలు " ఎలా జారీ చేస్తున్నారని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో ఆయా పనుల నాణ్యత తో పాటు ఫొటోలతో సహా ఆయా పనుల నిధుల ఖర్చుల వివరాలు అడుగుతా మని వారు అన్నారు.ఈ విషయంలో మండల,జిల్లా అధికారులతో పాటు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు గుర్తుంకో వాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు.

గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్తులు ఏర్పాటు చేయాలి 

బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నిధులు ఎన్ని వచ్చాయి, ఖర్చుల వివరాలు  బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో పౌరహక్కుల బోర్డులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ నిజామాబాదు జిల్లాప్రజా స్వామ్య మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు బి. ఆర్. నర్సింగ్ రావు, ఉపా ధ్యక్షులు డా, పవన్ కుమార్,నిజామాబాదు జిల్లా కార్యవర్గ సభ్యులు  బి.జగదీశ్వర్, బాల్కొండ అసెoబ్లీ నియోజక వర్గం అధ్యక్షులు కాల రవి,  కమ్మర్ పల్లి మోర్తాడ్ మండల అధ్యక్షులు కుండ శేఖర్, మండల అధ్యక్షులు తోట నవీన్, పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసారు.ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం నిజామాబాదు జిల్లా మొత్తo లో బాల్కొండ అసెoబ్లీ నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశామని వారు ఈ సందర్బంగా గుర్తు చేసారు.అతి త్వరలో బాల్కొండ లో నిర్మల్, నిజామాబాదు జిల్లాల మానవ హక్కుల కౌన్సిల్ సమావేశా లకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సమావేశాలల్లో రాష్ట్ర అధికారులు వస్తున్నారని వారు వివరించారు.


ముఖ్యమంత్రి కార్యదర్శుల పట్ల కఠినంగా ఉండాలి 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి హయాంలో అవినీతి పరుల భారతం పట్టడం నిజామాబాదు జిల్లాప్రజా స్వామ్య మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు 
బి. ఆర్. నర్సింగ్ రావు, ఉపా ధ్యక్షులు డా, పవన్ కుమార్,హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ లో అవినీతి అధిక్షరుల పట్ల  సింహ స్వప్నం
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని అభివర్ణిస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో అవినీతి పరులపై ACB దాడులు చేయడంతో కోట్లాది రూపాయలు వెలుగు లోకి రావడం పట్ల వారు హర్షo వ్యక్తం చేసారు.ఇది ఇలా ఉండగా తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతి కార్యదర్శులు 
ప్రతి చిన్న ధ్రువపత్రానికి కొంత ఇవ్వవలసిందే పైగా నూతన గృహ నిర్మానాలకు, నిర్మించిన ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలన్న 60 వేల నుండి లక్షల్లో డబ్బులు ఇవ్వాలని ప్రజల్ని పీడిస్తున్నారని ఈ విషయంలో తెలంగాణ ముఖ్య మంత్రి ప్రత్యేక శ్రద్ద వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల అక్రమ ఆస్తులపై ACB దాడులు చేయిస్తే ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని వారు ముఖ్య మంత్రి గారికి విజ్ఞప్తి చేసారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ