క్రిస్మస్ కానుక రూ.50 వేలకు పెంచాలి
చర్చిల సంఖ్య 70కి పెంచాలి.. నవంబర్ 25లోపే నిధులు విడుదల చేయాలి బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలకు అందించే తెల్లరంగు వేయడం, విద్యుత్ దీపాలంకరణ, అలంకరణ ఖర్చుల నిధులను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని మంచిర్యాల జిల్లా ఐక్య పాస్టర్ల సమాఖ్య బెల్లంపల్లి నియోజకవర్గ బాధ్యుడు పాస్టర్ కె.వి. స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 2 ఇంక్లైన్ బస్తీలో ఉన్న బెతెస్తా పెంతెకొస్తు ప్రార్థన మందిరంలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ ద్వారా ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున, ఒక్కో నియోజకవర్గంలో 50 చర్చిలకు నిధులు కేటాయించారని తెలిపారు. అయితే ఆ నిధులను జనవరిలో విడుదల చేయడంతో క్రిస్మస్ పండుగకు ఉపయోగపడలేదన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


