15న నగరంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం

15న నగరంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం

నిజామాబాద్ : నగరంలో ఆదివారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్​ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాన్స్​కో టౌన్​–3 ఏడీఈ వినోద్​ తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. వినాయక్ నగర్​ పరిధిలోని.. నగరంలోని వినాయక్​నగర్​ పరిధిలో 15వ తేదీ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ వినాయక నగర్–2 ఫీడర్​పై అలాగే ఆర్యనగర్–2 ఫీడర్స్ టవర్స్​ పనులు జరుగుతున్నాయని ట్రాన్స్​కో ఏడీఈ ​ తెలిపారు. ఈ సందర్భంగా 11 కేవీ ఆర్యనగర్ 2 ఫీడర్​ పరిధిలోని విశాల్ మార్ట్ ఏరియా, ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియా, జాకీ షోరూం, చికెన్ సెంటర్ ఏరియా, రామరాజ్​ కాటన్​ ఏరియాల్లో కరెంట్​ ఉండదన్నారు. అలాగే 11 కేవీ వినాయక నగర్–2 పరిధిలోని అగర్వాల్ హాస్పిటల్, పులాంగ్ హనుమాన్ ఆలయం ఏరియాలో విద్యుత్​ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ