59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల శంకర్,మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల శంకర్,మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఆదిలాబాద్ బ్యూరో : అదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న *59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల* కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, ముఖ్యంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తకాలు మనకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు ఆలోచనా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, ప్రముఖుల జీవిత చరిత్రలు వంటి పుస్తకాలను కూడా చదవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు సమాజంపై అవగాహన, క్రమశిక్షణ, మంచి ఆలోచనా విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం నిరంతరం కృషి చేయాలని, సమయాన్ని వృథా చేయకుండా చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అదిలాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య , మున్సిపల్ కౌన్సిలర్లు. కార్యదర్శులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ