షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ : మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. మెదక్, తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో జిల్లావ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణ, సైబర్ నేరాలపై 54 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మహిళలను వేధిస్తున్న 75 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు, 2 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మహిళలు, బాలికలు ఎలాంటి భయం లేకుండా తమకు ఎదురయ్యే వేధింపులపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

