తాడిచర్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు హక్కులపై అవగాహన..
- ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు వాలీబాల్ బహూకరణ
- గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో
మల్హర్ మండలం : మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేక సభ నిర్వహించి బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల భవిష్యత్తు, సమాజంలో వారి బాధ్యతల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు వాలీబాల్‌ను బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు చల్ల మహేందర్, పమిడి నిరంజన్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది హజ్మత్ అలీ, రాముడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో విద్యార్థులు, బాలబాలికలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


