అచ్చంపేటలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన
అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మండలం: అచ్చంపేట జిల్లా: నాగర్ కర్నూల్ నవంబర్ 14 : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేక వైల్డ్‌లైఫ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అడవుల ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణపై వివరించారు. మానవ-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత అని అధికారులు వెల్లడించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ పరిరక్షణ భావన పెంపొందించాలని సూచించారు.అనంతరం అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. విద్యార్థులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, డాక్టర్ రాజశేఖర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు నాయక్, అపోలో ఫౌండేషన్ వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


