ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ
చౌట్కూర్ :- సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామంలో శనివారం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులకు వివిధ రకాల వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా మొత్తం 53 గేదెలు, 9 ఆవులు, 50 దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. అలాగే గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు నిర్వహించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపొందించేందుకు పశుపోషకులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా VB-G RAM G పథకం ద్వారా పశుగ్రాసం సాగు చేసుకునే విధానం, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, పశుపోషకులకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి వివరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


