బాలల దినోత్సవం సందర్భంగా చా చా నెహ్రూ కు నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో : దేశ స్వాతంత్య్రం కోసం ఎంతగానో కష్టపడి, స్వాతంత్ర్యానంతరం దేశ మొట్టమొదటి ప్రధానిగా పనిచేసిన మహనీయులు పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ గారి సేవలను భారత జాతి ఎన్నడూ మరిచిపోలేదని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 14న నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, నేడు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల చాచా నెహ్రూ విగ్రహానికి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని భారతదేశమంతటా బాలల దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. "నేటి బాలలే రేపటి పౌరులు" అని గుర్తు చేసేదే బాలల దినోత్సవమని, పెద్దలు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బాలల అభివృద్ధికి, విద్యార్థులకు అన్ని అవకాశాలు కల్పిస్తూ గురుకులాలు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. మనమంతా నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకై పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సూపర్‌వైజర్ రాజ్ కిరణ్, అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్ స్వామి, ఎల్‌డీసీ అవినాష్, జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ హసన్, హరీష్, మోసిన్, అల్లూరి భూమారెడ్డి, మనోజ్, ప్రఫుల్, నాగన్న, శివ్వరెడ్డి, విశాల్, త్రిషల్, గణేష్, దినేష్, రవి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


