సంచుల్లో నింపిన ఆరు వడ్ల బ్యాగులు మాయం వడ్ల దొంగలు ఉన్నారు జాగ్రత్త సుమా !
సిద్దిపేట జిల్లా బ్యూరో చీఫ్ : సిద్దిపేట జిల్లా లో గలమండల కేంద్రమైన కొండపాకలో వడ్లను రోడ్డుపై ఎండబెట్టి సంచుల్లో నింపిన తరువాత సంచులు 6 70 కేజీల గల ఎత్తుకుపోయిన సంఘటన కొండపాకలో జరిగింది. రైతు కథనం ప్రకారం శివాలయం డివైడర్ రోడ్డు మార్గంలో సుమారు నాలుగు ఐదు రోజుల క్రితం అనగా బుధవారం రాత్రి వడ్లు ఎండిన వడ్లను సంచుల్లోకి నింపి 53 ప్లాస్టిక్ బ్యాగులు నింపి సుమారు 72 కేజీల బరువు గల మొత్తం 53 బ్యాగులను నింప పైనుండి ప్లాస్టిక్ కవర్ కప్పి ఉదయం యధావిధిగా ప్లాస్టిక్ కవర్ తీసి చూడగా 47 బ్యాగులు ఉన్నట్లుగా గ్రహించి బోరుణ విలపించాడు పక్కనగల సీసీ కెమెరాలు పరిశీలించిన ఏమీ తెలియలేదని ఆయన తెలిపారు. సుమారుగా పదివేల రూపాయల ధాన్యం సంచులు మాయమైనట్లు తెలిపాడు. ఆరుబయట ఎండబెట్టే రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని రైతులను కోరారు. గతంలో కూడా కొండపాక మండల కేంద్రంలో 16 సంచులు నింపినవి మారమైన నరసింహులు సంబంధించినవి ఎత్తుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఆచూకీ లభించలేదు అని అన్నారు ఇకనుండి అయినా రైతులందరూ జాగ్రత్త వహించాలని సూచించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


