రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు గడువు విధించాలి

ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలి.. కార్మికుల సంఖ్య పెంచాలి

రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు గడువు విధించాలి

ఆలయ విస్తరణ పనులను సమీక్షించి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు , వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. పనుల వారీగా కాలపరిమితిని నిర్ణయించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పనుల వేగం పెంచేందుకు అవసరమైన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని స్పష్టం చేశారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుత పురోగతిని సమీక్షించారు. అనంతరం అధికారులతో కలిసి ఆలయ విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, పనుల వేగవంతానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులన్నీ నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పనికి ప్రత్యేక గడువు విధించి, నిరంతర పర్యవేక్షణతో ముందుకు సాగాలని సూచించారు. నిర్మాణ పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి, ఎక్కడా జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, స్థపతులు జయేంద్రన్, గణేష్, స్ట్రక్చర్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ