డీప్ లెర్నింగ్‌తో క్యాన్సర్ గ్రేడింగ్‌లో 98.8 శాతం కచ్చితత్వం
గీతం పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావుకు పీహెచ్‌డీ ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో అధునాతన సాంకేతికతతో పరిశోధన
పటాన్చెరువు : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనం, ఏకీకరణ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్‌ను మెరుగుపరచడం’ అనే అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్ లభించింది. ఈ పరిశోధనకు గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రవిశంకర్ మార్గదర్శకత్వం వహించారు. హిస్టోపాథలాజికల్ చిత్రాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను స్వయంచాలకంగా గుర్తించడం, గ్రేడింగ్ చేయడంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రమణారావు అధునాతన డీప్ లెర్నింగ్ నమూనాలను అభివృద్ధి చేశారు. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, విజన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏకీకృతం చేయడం ద్వారా 98.8 శాతం వర్గీకరణ కచ్చితత్వాన్ని సాధించారు. ఈ పరిశోధన కచ్చితమైన, సమర్థవంతమైన క్యాన్సర్ నిర్ధారణకు దోహదపడనుంది. రమణారావు డాక్టరేట్‌కు అర్హత సాధించడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి సయ్యద్ అక్బరుద్దీన్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. మహబూబ్ బాషా, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఆయన పరిశోధన, విద్యా రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


