రాష్ట్రస్థాయి బరిలో భిక్కనూర్ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ!

--జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో సత్తా చాటిన విద్యార్థినులు.. రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాజెక్టు ఎంపిక స్వాతి, శ్రీవిజ్ఞాన్‌కు అభినందనల వెల్లువ.. -ప్రభుత్వ పాఠశాలల ప్రతిభకు మరో నిదర్శనం

రాష్ట్రస్థాయి బరిలో భిక్కనూర్ పాఠశాలల విద్యార్థుల  ప్రతిభ!

భిక్కనూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లోనూ అసాధారణ ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు మరోసారి నిరూపించారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా నిర్వహించిన కామారెడ్డి జిల్లా స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటిన విద్యార్థినులు స్వాతి, శ్రీవిజ్ఞాన్ రూపొందించిన శాస్త్రీయ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వినూత్న ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ పోటీల్లో భిక్కనూర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రాజెక్టు న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. జిల్లా స్థాయిలో ఎంపికైన ఏడు ఉత్తమ ప్రాజెక్టుల్లో భిక్కనూర్ పాఠశాల ప్రాజెక్టుకు స్థానం దక్కడం విశేషం.
శాస్త్రీయ ఆలోచనలకు అధికారుల ప్రశంసలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, బాల శాస్త్రవేత్తల వినూత్న ఆలోచనలు వికసిత భారత్ నిర్మాణానికి దోహదపడాలని ఆకాంక్షించారు. సమాజంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనే దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.
జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ రంగంలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉండటానికి ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనూ ప్రతిభకు కొదవలేదు!
ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమనే భావనను పటాపంచలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా పరిశోధనాత్మక ఆలోచనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నారు. భిక్కనూర్ బాలికల పాఠశాల విద్యార్థినుల విజయం ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
విద్యార్థినులు స్వాతి, శ్రీవిజ్ఞాన్ సాధించిన ఈ విజయానికి గైడ్ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడయ్యాయని విద్యాభిమానులు ప్రశంసిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా భిక్కనూర్ మండలానికి గర్వకారణంగా మారింది.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థినులు ఇదే ఉత్సాహంతో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ఉన్నత స్థాయికి చేరుకోగలరని స్వాతి, శ్రీవిజ్ఞాన్ విజయం మరోసారి చాటిచెప్పింది.

Views: 61

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ