ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
*1,078 నూతన పింఛన్లు *164 కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులు *17,639 నూతన స్మార్ట్ కార్డుల అందజేత
కోయిలకొండ : నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర జరిగిన ప్రత్యేక సమావేశంలో నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతన పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు స్మార్ట్ కార్డులను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కుంభం శివకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు, నిస్సహాయులకు అండగా నిలవడమే నిజమైన ప్రజా పాలనకు నిదర్శనమని అన్నారు. మన పెద్దలు తమ జీవితకాలమంతా కష్టపడి కుటుంబాన్ని, సమాజాన్ని నిలబెట్టారని, అలాంటి పెద్దలకు ఆత్మగౌరవంతో కూడిన భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సంకల్పంతో 'చేయూత' (Cheyutha) పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తోందని తెలిపారు.ఎంతో కాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదల కళ్లలో ఆనందం నింపేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల మంది నూతన లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేసి, ఈ నవంబర్ నెల నుంచే మంజూరు పత్రాలను అందజేయడం ఎంతో సంతోషకరమైన విషయమని వారు పేర్కొన్నారు. ఇందులో వయోవృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత మరియు గీత కార్మికులు కూడా ఉండటం విశేషమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్, స్థానిక ఎంపీడీఓ, ఎమ్మార్వో, పార్టీ సర్పంచులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, లబ్ధిదారులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


