సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల.. 9వ గేటు ఎత్తివేత దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు (బాగారెడ్డి) ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి తాగునీటి అవసరాల నిమిత్తం 0.15 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. నవంబర్ 14, 2026 మధ్యాహ్నం 3 గంటల తర్వాత గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ముందస్తు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టులోని 9వ గేటును 1.3 మీటర్ల ఎత్తు మేరకు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ గేటు ద్వారా మొత్తం 2,880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. మంజీరా బ్యారేజీ తాగునీటి అవసరాల కోసం కేటాయించిన 0.15 టీఎంసీల నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది.నీటి విడుదల నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, నీటి ప్రవాహ మార్గాల సమీపంలో నివసించే వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు నదిలోకి దిగకూడదని, పశువులను కూడా నీటి ప్రవాహానికి దూరంగా ఉంచాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


